మా అన్నయ్య: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ
అన్నయ్య అన్నయ్య
మా మంచి అన్నయ్య
నీ మనసే వెన్నయ్య
మా ఇంటి కన్నయ్య !

అన్నయ్య అన్నయ్య
మరువము నిన్నయ్య
వ్రేలుపట్టి నడిపించావు
ముద్దపెట్టి తినిపించావు !

అన్నయ్య అన్నయ్య
నీ పేరేగా రామయ్య
మా మల్లెపువ్వయ్యా
మము అల్లుకోవయ్యా !

అన్నయ్య అన్నయ్య
మామొర వినవయ్యా
తప్పులే చేయమయ్యా
మమ్ము మన్నించవయ్య !

అన్నయ్య ఓ అన్నయ్య
మము శిక్షించ వద్దయ్యా
 చెప్పినట్టు వింటమయ్య
నీ రక్షణలో ఉంటమయ్య !

అన్నయ్య ఓ అన్నయ్య
మే వినకుంటే తన్నయ్య
ఆ శిక్షే మాకు ముద్దయ్య
మము విడిచి పోవద్దయ్య !

అన్నయ్య ఓ అన్నయ్య
ఈ ఇల్లే ఇక నీదేనయ్య
రాజీపడి నువు రావయ్య
ఇంటికి వెలుగు తేవయ్య. !

అన్నయ్య ఓ అన్నయ్య 
మహారాజువు నీవయ్య
నీ మాటే శాసనమయ్య
నీకిక ఓటమి లేదయ్యా !


కామెంట్‌లు