కనుమ కనుమ కనుమ
ఆవశ్యం నీవు ఇక కనుమ
అనుమ అనుమ అనుమ
అంతా సమాన మనుమ !
కనుమ కనుమ కనుమ
ఇరుగు పొరుగు కనుమ
సాయం ఇక కావలనుమ
పొందే విధానం వినుమ !
కనుమ కనుమ కనుమ
అందరి కడకు చనుమ
నా వారని ఇక అనుమ
వారు చెప్పేదిక వినమ!
కనుమ కనుమ కనుమ
మంచి చెడులను కనుమ
మంచిని ఎంచుకొనుమ
చెడును విడుచుకొనుమ !
కనుమ కనుమ కనుమ
సుఖదుఃఖాలను కనుమ
మాటే మంత్రం వినుమ
సరైన దారిలో చనుమ !
కనుమ కనుమ కనుమ
పాడిపంటలను కనుమ
పైరు పాటలను వినుమ
హరిలోరంగ హరి అనుమ !
కనుమ కనుమ కనుమ
భోగభాగ్యాలను కనుమ
కన్నీటి కథలన్ని వినుమ
నీ జీవితాన్ని సర్దుకొనుమ !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి