నా చక్కని పాట: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977 కల్వకుర్తి
పాడుతా చక్కని ఓ పాట
వేడుతా వినమని ఈ పూట
మీ చెవులారా విన రారండి
మీ కనులారా కన రారండి !

నే పాడిన నా పాటను విని
నా ముఖ ఆహార్యమును కని
మీరంతా రారండి ముందుకు
నా పాటల వీనుల విందుకు !

నచ్చి మెచ్చి మీరంతా వచ్చి  
తగిన బహుమానం నాకిచ్చి
నాకు గుర్తింపును తేవాలండి
మీ సమర్థింపు  కావాలండి. !

మీరు ఇచ్చేటి ఆ బహుమతి
అంతా మెచ్చేలా ఉండాలండి
మీ ముఖ ప్రశంసలతోని ఇక
నా పాట చక చక సాగాలండి !

శ్రోతలంతా ఉంటారు నా వెంట  
ఆశ్రోతలతోనే ఉంటుందిక తంట
వారు మెచ్చితేనే పండేను పంట
వారి తోడై నీడై వారి వెంట ఉంట !

నన్ను గురించి నా పాట గురించి
పాఠకులకు తెలిపేను మీడియా
గుణపాఠమై నిలిపేను ఐడియా
పాటను నిక్షిప్తం చేసే వీకీపాడియా!


కామెంట్‌లు