నే కోరిన సాయం: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.
నాకోసం ఎదురు చూసే
నా మొగడై నన్నే మోసే
నాకు ఓ మగాడు కావాలి
వాడు మొనగాడై ఉండాలి !

వాడు నా అందం చూసి
నాతోనే ఇక పందెం కాసి
ప్రేమలో తను ఇక నెగ్గాలిబ
ప్రేమామృతంలో  మగ్గాలి !

నే చెప్పిన మాటను వింటూ
నిత్యం నా వెంటే వాడుంటూ
నా కౌగిలిలో కలలను కంటూ
వాడైపోవాలి  నా స్టూడెంటు !

నా ఒడిబడిలో వాడుండాలి
ప్రేమామృతమును వండాలి 
నా పిల్లలను ఆడిస్తుండాలి
వారికి దుస్తులు వేస్తుండాలి !బ

శుభోదయమున తను లేపాలి
నా పిల్లల ఊయలను ఊపాలి
ఆ పిల్లల బడిబాటను చూపాలి
చెప్పే వాటన్నింటికీ తను ఓపాలి !

ఇలాంటి వాడుంటే తెలపండి
వాడిని నాతో మీరు కలపండి
నే కోరిన సాయం మీరిక చేస్తే
నాకు మీరు అవుతారిక దోస్తే  

ఒకరికి ఒకరం చేస్తే ఇక సాయం
మరిక ఉండదు మనకు వ్యయం
అప్పుడు కలుగదు మనకిక లోటు
ఎప్పుడు ఉండదు జీవితాన చేటు!



కామెంట్‌లు