ప్రేమాయణం: గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ
నే ప్రేమాయణమును చదివి
ఆ ప్రియ ప్రేమలో నేనిక ఎదిగి
రాస్తున్నా నీకు నే ఓ ప్రేమ లేఖ  
చూస్తున్న నీ వస్తావని ఇందాక !

ఈ పవిత్ర  ప్రేమలో పడ్డాం మనం
ఏ చరిత్ర ఏమి చెప్పినా ఇక వినం
మనకు మన ప్రేమేకదా ఇక ఘనం 
తెలియక తికమకపడతారు జనం

లోకంలోని లోకులు పలు కాకులు
ఏకం వారై ప్రేలుతారిక  చెవాకులు
ప్రేమే దైవం అని వారు  అనుకోరు
ప్రేమ వైనం సంపూర్తిగా వినుకోరు

 ప్రేమే నిన్ను నన్ను ఏకం చేసింది
జంటై మనం ఉండాలని రాసింది
మన ప్రేమే లోకంలో కోడై కూసింది
ఘనమై ఈ లోకం నిండై పూసింది

కాసి పూసిన మన ప్రేమ పుష్పం
కా వద్దు ఎన్నటికీ కన్నీటి భాష్పం
అనుకొని వ్రాస్తున్న ఈ ప్రేమ లేఖ
కనుగొని నా వద్దకు నీవే వస్తావిక

అలా జరగాలని నేకోరుకుంటున్న
నీప్రేమ అలజడిని నేను వింటున్న
ఇది కల కాకూడదని నే అంటున్న
మది ఓర్పు నేర్పుతోనే  ఉంటున్న

ప్రేమ పల్లకిలో ఊరేగుదాం మనం
ప్రేమకు హిపీప్పురే అంటేనే ఘనం
అప్పుడవుతుందిక  ప్రేమ పావనం
దెప్పుడు  లేకుండా సాగు జీవనం!

వివరంగా  విషయాలను రాశాను
నీపరంగా ఆశయాలను మోశాను 
మన ప్రేమకే  క్రొత్త దారిని తీశాను
చివరకు నిన్ను నా సతిగా చేశాను 

.

కామెంట్‌లు