సరిగమల సంసారం;- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977 కల్వకుర్తి
అమ్మాయి ఓ అమ్మాయి
నువ్వు వస్తావా బొంబాయి 
నేను చూస్తే నీ కను దోయి
నాకు కలుగుతుందిలే హాయి !

నీ చీర కట్టు భలే బాగుంది
నీ చనికట్టు నన్నిక రమ్మంది
లేనే లేరిఇక్కడ మా సిబ్బంది
అవుతుందాఏం నీకిక ఇబ్బంది !

బొంబాయి వచ్చిన నీవు
రాంబాయివి అయినావు
నీ ఊరిని నీవు మార్చుకొని
నీ పేరు ఇక మార్చుకున్నావు!

ఆ తెల్లని అల్ల నేరేడు పళ్ళు
నీ తెల్లని వన్నెల నీలాల కళ్ళు
నీ రాక కోసం నే కన్నా కలలు
నీ మేని తీరం చేరిన అలలు !

నువ్వేలే ఇక నా ఇంతివి
నే ప్రేమించిన పూబంతివి
నీ వైపే చూస్తుంది నా కన్ను
నా వైఫై ప్రేమించు ఇక నన్ను !

అయిపోతామిక మేం ఆలుమగలం
సాగిస్తామిక సరిగమల మా సంసారం
మీరు మా కాపురాన్ని దీవించండి
మీ వారిగా మమ్మిక భావించండి !

 

కామెంట్‌లు