స్నానం ప్రస్థానం:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత.-సెల్9491387977 కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.
 స్నానం ఎంతసేపు చేయాలో ఎలా చేయాలో మీకు తెలుసా సుమ బాల నేస్తాలు! స్నానం గురించే ఇప్పుడు మీతో నా ప్రస్థానం.
స్నానం ప్రతిరోజు 5,6 గంటల మధ్య చేస్తే ఆరోగ్యదాయకం. మొదట నాలుగు చెంబులతో శరీరాన్ని బాగా తడపి, సున్నిపిండితో శుభ్రంగా రుద్దుకొని, ఆపై ఎనిమిది చెంబులతో శుభ్రపరచుకోవాలి. చక్కటి మెత్తటి టవల్తో అద్దుకొని శరీరాన్ని తుడుచుకోవాలి. స్నానానంతరం శరీరంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోవాలి. అలా చేయకుంటే అనేక రోగాలు వచ్చే ఆస్కారం ఉంది.
మర్మాంగాల వద్ద సరైన గాలి తగలకపోవడం వల్ల ఆ ప్రదేశాల్లో సూక్ష్మజీవులు చేరుతాయి. శుభ్రంగా స్నానం చేసుకుని ఫ్యాన్ కింద ఓ నిమిషం నిల్చుని ఆపై దుస్తులు ధరించాలి.
స్త్రీలు ఒంటిమీద ఏమీ లేకుండా స్నానం చేయాలి. పురుషులు ఏదో ఒక గుడ్డ కట్టుకొని స్నానం చేయాలి. తెల్లవారుజామున నాలుగు, ఐదు మధ్య చేసే స్నానం స్నానం అనగా ఋషి స్నానం.
ఉదయం 5, 6 మధ్య చేసేది దైవ స్నానం.6, 7 గంటల మధ్య చేసేది మానవ స్నానం. ఆపైన చేసేది రాక్షస స్నానం. చన్నీటి స్నానం మంచిది. నది స్నానం ఉత్తమోత్తం. చెరువు స్నానం మద్యమం. నూతి స్నానం అధమం. కావున సరైన టైంలో సరైన స్నానం చేయుట ఆరోగ్య దాయకం.

కామెంట్‌లు