గులాబి రంగు పూలనే తెచ్చి
గుభాలించు దండలనే గుచ్చి
ఆ గోవిందుని మెడలోన వేస్తా
నే విందిచ్చి మదిలోన తలుస్తా !
తలువగానే పలికేటి దేవుడు
మదిలోన నిలిచేటి రాముడు
గోవిందు గోపాలుడు ఒక్కటేరా
గోవర్ధనగిరిని వీడు ఎత్తినోడురా !
యశోదమ్మ ఇంట్లో పెరిగిన వాడు
పాలు పెరుగు వెన్న మరిగినవాడు
దేవకి వసుదేవులకు పుట్టిన వాడు
పికిపించమునే తలకు కట్టినవాడు
బృందావనమందు ఆటలాడు వాడు
బృంద గానం చేస్తూ పాటలు పాడు వీడు
గోపికల ఆడిస్తడు గోవుల మేపిస్తడు
రంగా రంగా అంటూ టింగు రంగడై తానొస్తడు !
మురళీ గానము తాను చేస్తూ
గోపికలకు వలువలు ఇక ఇస్తూ
ఆకర్షిస్తాడిక గోపికల అందరిని
తన మదిలోన ఉన్న సుందరిని !
గోవిందా గోవిందా అనగానే వింటడు
నేనున్నా నేనున్నా అని తానంటడు
ఏడుకొండలపై నివసిస్తూ ఉంటడు
తన భక్తులను పోషిస్తాని అంటడు!
మన పూజలు మెచ్చి వరాలు తాను ఇచ్చి
మనం అందించిన నైవేద్యాన్ని ఆరగిస్తడు
మోక్షమిచ్చి మనలను ఇక చేరదీస్తాడు
వాడే నమ్మ వాడు గోవిందుడు ఆనందుడు !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి