ప్రేమ కౌతుకం !:-గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977 కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.
నీఉంటేనే చెలి నా వెంట
పండును వలపుల పంట
ఆదర్శంగా ఉంటే మనం
అదే కదా మనకు ఘనం  !

నీవు కన్ను గీటుతూ ఉంటా వంట
నాకు గుండెల్లో రేగుతుంది మంట
నీఒడి బడిలో చదివే నీపతి నంట
నాతడిపొడి అపనల సతి నీ వంట

తప్పక రావాలిక చెలి ఈ పొద్దు
చెప్పకనే ఇవ్వాలి నాకో ముద్దు
ఇద్దరి ప్రేమకు లేనే లేదిక హద్దు
ముద్దుల ప్రేమకు ఉండదు రద్దు ! 

నీ ముద్దుల మూటనిక  కట్టి
నా సుద్దుల పద్దును చూపెట్టి
నువ్వు కొట్టకు నాకు ఇక జెల్ల
నన్ను తిట్టకు నీవిక ఓ నాపిల్ల !

నీ చక్కని మోమును నేచూసి
నేఎక్కడ ఫోను నిన్ను ఎడబాసి
ఏ తొందర లేదు  అందాల రాశి
నా ముందుకురా బంధాలు వేసి !

నీ వయసు పడి పడి లేస్తుంది
నా మనసు విడివడి చూస్తుంది
మన ప్రేమకు చుట్టాలిక  శ్రీకారం
ఘన గోపురానికి కట్టాలి ప్రాకారం !


కామెంట్‌లు