మేము మరువని మహా మనీషి :- గుర్రాల లక్ష్మారెడ్డి. కవి-సెల్.9491387977.
మరణం లేని మా యన్నం అన్న
దివికేగి నేడు అమరజీవాయనన్న
సాహిత్య సృజనశీలి అతడు అన్న
చరిత్ర సృష్టించి అయ్యాడు మిన్న !
 
అన్న యన్నం రుక్మాంగద రెడ్డి
సాహిత్యానికి వెన్నెముక కడ్డీ '
వీరి సాహిత్య సేవేఏ నిదర్శనం
వారు రాసిన పుస్తకాల ప్రదర్శనం ! 

ఏం తమ్ముడు అంటూ ఎలా ఉన్నావ్ అంటూ
మీ పలకరింపు మేం మరువని పులకరింపు
భౌతికంగా మీరు అయ్యారు మాకు దూరం
మా అందరి మదిలో నింపారు పెను భారం !
 
కవిత్వంలో మీరు నేర్పిన ఓనమాలు
మేమెవరం మరువని ఆ శ్రీరామ నామాలు
మిమ్మల్ని తలుచుకుంటూ కొలుచుకుంటుంటం
మీరే మకుటం లేని మా మహారాజంటుంటం!

భౌతికంగా మాత్రమే మీరు మరణించారు
మానసికంగా మరణాన్ని జయించారు
మా అందరి హృదయాల్లో జీవించారు
అమరజీవియై ఆ విధినే జయించారు !

శోక తప్త హృదయంతో మీ తమ్ముడు. 
గుర్రాల లక్ష్మారెడ్డి. కవి-సెల్.9491387977. 

కామెంట్‌లు