క్రాంతి! సంక్రాంతి: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత -సెల్.9492387977 కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ
సంక్రాంతి ఈ సంక్రాంతి
మా సరి క్రొత్త సంక్రాంతి
కులాసాగాను వచ్చింది
విలాసాలను ఇచ్చింది. !

సంక్రాంతి మా సంక్రాంతి
సరదాల మా సంక్రాంతి
భోగి మంటల సంక్రాంతి
తీపి వంటల సంక్రాంతి !

సంక్రాంతి ఈ మా సంక్రాంతి
మా సంక్రమణ సంసంక్రాంతి
చెడును దహించు సంక్రాంతి
మంచిని పెంచు ఈసంక్రాంతి!

క్రాంతి సమన్విత సంక్రాంతి
సంక్రమణ సమైక్య సంక్రాంతి
రంగుల హంగుల సంక్రాంతి
పాల పొంగుల మా సంక్రాంతి !

ముద్దుల ముగ్గుల మా సంక్రాంతి
హరిదాసు హరి కీర్తనల సంక్రాంతి
గాలిపటాల జోరుఉన్న సంక్రాంతి
మగువల ముగ్గుల మా సంక్రాంతి

సంక్రాంతి మా ఈ సంక్రాంతి
డూడూ బసవన్నల సంక్రాంతి
డుం డుం భాజాల సంక్రాంతి
ఆటపాటల మూటల సంక్రాంతి !

సంక్రాంతి మా ఈ సంక్రాంతి
ఆనంద హేళల వేళ సంక్రాంతి
సంక్రమణ సంలీల సంక్రాంతి
సరికొత్త సరాగాల  సంక్రాంతి !;


కామెంట్‌లు