సుభాషితాలు :- అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ -9640748497
2026వ సంవత్సరపు రెండో రోజు 
ఈ రోజు 
గతిశీలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళాలి
కర్మలు చేస్తూ కాలాన్ని అనుసరిస్తూ 
కాల యవనికపై మనం చెరిగిపోని సంతకమౌకటి చేయాలి 
అంతే కానీ 
కాలం కలిసి రాలేదు 
కాలం కాలనాగై బుసకొడుతుంది వంటి మెట్ట వేదాంతం పనిచేయదిక్కడ?!

పనిపట్ల అంకిత భావం
శక్తివంచనలేనితనం
ఫలవంతమవుతుందన్న ఆశవాదదృక్పథం
మనల్ని మహనీయులను చేస్తుంది.

పరాన్న జీవనం ఆత్మగౌరవహీనత్వం
జీవశ్చవ సదృశ్యం

సాకారం చేయని ఎన్ని కలలుగన్నా 
అవి మన ఉద్వేగాలను రెచ్చగొట్టేవే తప్పా
సఫలీకృతం కానివనునది తెలుసుకొనుట విజ్ఞుల లక్షణం 

ఈర్ష్య అసూయలు లేకుండా ఆత్మసంతృప్తితో జీవించడం నేర్చుకోవాలి 

పోటీ ఆరోగ్యవంతమైనదై ఉండాలి
గెలవాలన్న తపనుండాలి
 కానీ 
తప్పుడు దారిలో గెలవడం 
ఆత్మ ద్రోహంతో సమానమన్నది మరువరాదు

ఆధునిక కాలంలో కత్తులు దూయవలసిన అవసరం లేదు ఉద్వేగాలను రెచ్చగొడితే చాలు 
సామాజిక మాధ్యమాల్లో... ఎందుకో ?ఎవరికోసమో?
 ఏ ఫలాపేక్ష ఆశించి 
ఈ వాగ్యుద్ధం జరుగుతుందో
తెలియకుండానే సామాజిక చైతన్యలేమితో అజ్ఞానులమై 
అవాకులు చవాకులు పేలుతూ సోషల్ మీడియా సో కాల్డ్ బ్రాండ్ మేధావులమై ఊరేగుతుంటారు కొందరు 

పావలాకు గొరగానోడు అనవసర రాద్ధాంతాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయువాడు 

ముందు వాడి పెడరెక్కలు విరిచికట్టేయాలి 
సామాజిక మాధ్యమమంటే
రహస్యంగా చేసుకునే కాపురాన్ని రచ్చకీడ్చడమనుకునే పేచీలకోరు ప్రబుద్ధులు 

కలం పోటు నాడు ప్రింట్ మీడియా జనబాహుళ్యంలో ప్రజాదరణ ఉన్న రోజుల్లో ఉండేది 

నేడు మితిమీరిన వాక్ స్వాతంత్ర్యం 
సెల్ఫ్ డబ్బా వక్తలకు 
ఒక వరమై
అనవసరమైన విషయాలు 
పోస్ట్ అవుతున్నాయి
నిత్యం సోషల్ మీడియాతో కాలక్షేపం చేసే
ఎమోషనల్ అదుపులో లేని వారు 
అనవసరాలను సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేసి తలో మాటేసి 
మరోకడు ట్రోల్ చేసి
వాడేదో వరల్డ్ రికార్డ్స్ కైవసం చేసుకొని 
అతని ఆత్మకథను అప్పజెప్పుతున్నట్టు
ఎమోషనలై నాకు భావప్రకటన స్వేచ్ఛ ఉందని 
ఊగిపోతూ మాట్లాడుతుంటాడు 

ఇదేమైనా కడుపు నింపేదా!?
యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించేదా!?
మనల్ని సన్మార్గంలో నడిపేదా!?
విజ్ఞత మరచి మాట్లాడేవారు
ఆత్మావలోకనం చేసుకోవాలి 

విలువైన సమయాన్ని 
విలువైన ధనాన్ని  ఉపయుక్తమైన వాటికై వెచ్చించాలి 

సూచనలు సలహాలను సమాజహితమైనవి 
చేసిన  నాడు
సోషల్ మీడియా ఇదో సామాజిక చైతన్యానికి ప్రతీక అవుతుంది 
కానీ 
వెకిలి చేష్టలకు ,వెర్రితనానికి
డంభాచారానికి అడ్డాగా మార్చొద్దు 

ఏదేమైనా నీయవ్వ తగ్గేదేలే
అని అంటే తగిన గుణపాఠం చెబుతుంది చట్టం,
పోలీస్ యంత్రాంగం

కామెంట్‌లు