నేను గొప్పవాడినే
నాలోని అహం
అంతరించినప్పుడు
నేను గురువునే నా చుట్టూత ఉన్న సమాజాన్ని సంస్కరించినప్పుడు
ఏదిసంబద్దమో!
ఏది అసంబద్ధమో నా సహచరులకు ఎరుకపరిచినప్పుడు
నేను దాతనే
ఆపన్నులను గుర్తించి గుప్త దానాలు చేసినప్పుడు
శ్రమ సౌందర్యాన్ని రుచిచూడమని నేను నా మాటగా చెప్పినప్పుడు
నేను అజాత శత్రువునే
నేను పదుగురితలలో నాలుకలా ఉన్నప్పుడు
నేను దేశభక్తుడనే నేను నా దేశ సౌభాగ్యం , ఔన్నత్యంకోసం నిరంతరం పరిశ్రమించినప్పుడు
నేను స్ఫూర్తి ప్రదాతనే
నా ఆశయాలు ఆకాంక్షలు ముందు తరాలకు ఆదర్శప్రాయమైనప్పుడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి