ఒకప్పటి సినిమాల్లో
కథానాయకుడు, కథానాయికలు నిండైన ఆహార్యంతో చేతులెత్తి మ్రొక్కేలా ఉండేవారు.
నేడు హీరోయిన్లు చేయ్యేత్తి కొట్టేలా
ఉంటున్నారు అర్థనగ్నంగా అనేక సినిమాల్లో..
ఇది సినిమా నిర్మాతల కాసుల కక్కర్తీ సూత్రమా!?
ఒంటిమీద పొట్టి పొట్టి బట్టలు ధరించడం
డబుల్ మీనింగ్ డైలాగులు
బూతు నీతై వల్లెవేయు సినిమాపాటలు
అర్థం పర్థం లేని సాహిత్యం
సొమ్ముల కోసం వ్రాసే పేయిడ్ రైటర్స్
కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా ఒకే ఒక్కరై వండివర్చుతున్నారు
అవార్డులు పిక్చర్స్ (అవహేళన పరాకాష్టకు చేరిన కంటెంట్)
అర్థనగ్నమే సినిమాకు కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని నమ్మే కాసోత్తములు.
త్రీ వీక్ ఆడని పిక్చర్స్ ను
టికెట్ రేట్లు అమాంతం పెంచి
ఐదు షోలు బొమ్మనాడించి
నీ యవ్వ బొమ్మ సూపర్ డూపర్
అంటూ పేయిడ్ ప్రమోషన్లు చేయించడం
సాధారణ ప్రేక్షకుడికి తలనొప్పిగా మారిన
కంటెంట్ లెస్ సినిమాలు
విడుదలైన సినిమాలకు
వివిధ సామాజిక ప్లాట్ ఫామ్
ద్వారా నిర్మాణవ్యయాన్ని
పదింతలు రాబట్టుకునే
ఇబ్బడి ముబ్బడిగా ప్రమోషన్లతో బిజీ యైన
సినీనిర్మాతలు
పాన్ ఇండియా పిక్చర్ గా రిలీజ్ చేసి
గ్లోబల్ సినిమా మార్కెట్లోకి ఎంటరై
అత్యుత్తమ డైరెక్టర్,స్టార్, హీరోయిన్ గా అరువిచ్చి
గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు
బ్రతుకు కథలను వెతలను
ఆవిష్కరించని సినిమాలు
సామాజిక చైతన్యహీనత్వానికి
ప్రతీకలు
ఇకనైనా మనం మేల్కొందాం
ఆడిషన్స్ బేస్డ్ కంటెంట్ సినిమాలనే మేం చూస్తాం
అంతే తప్పా
ఏదో ప్రొడ్యూసర్ పైత్యపు కంటెంట్
ప్రేక్షకుల మీద రుద్దడం సహేతుకంకాదని

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి