కాలక్షేపం కోసమా!కవి సమ్మేళనాలుసామాజిక వికాసంకోసమా!?పుస్తకావిష్కరణ సభల కోసమైముందస్తుసభికుల ఏర్పాట్లకోసమా!?సమకాలీనత కొరవడ్డఅంశాలతో కూడిన కవిసమ్మేళనాలుసభాసదుల ముఖస్తుతి కొరకైఏర్పాటు చేసినకవి సమ్మేళనాలుఉబుసుపోని మాటముచ్చట్లేకదా!?ప్రపంచమే కుగ్రామమైనఈ తరుణంలోసామాజిక సమస్యలకు కొదవేముంది?!ఆయా ప్రాంతీయ భాషల్లో జరిగుతున్న అన్యాయాలు అరాచకాలు వ్రాసే సాహసం చేసేకవులు కవయిత్రులు చేతులు ముడుచుకొని కూర్చోవడం అంటేకష్టజీవి కుడి ఎడమన కవులు లేనట్లే కదా!కవులు, కవయిత్రులు ప్రజాపక్షం వహించే ప్రజాప్రతినిధులు కదా!?ఆత్మాశ్రయత్వపు కవిత్వం కడుపు నింపేదా?!ఆకలి పేగుల ఆర్తనాదాలుఅభివృద్ధికి నోచుకోని పల్లెల దైన్యంబడికి దూరమైన బాలల బాలకార్మికత్వంబాల్యవివాహాలుమహిళపై జరుగుతున్న అత్యాచారాలుకులమతవర్ణ వర్గ పోరాటాలుమానవ హక్కుల ఉల్లంఘనలుచట్టం ఇంటి చుట్టంగా మార్చుకున్న స్వార్థరాజకీయలుఅటవిసంపద కొల్లగొట్టడాలువన్యప్రాణుల అభయారణ్యాలను తెగనకడంవిలువైన కలప అరుదైన జాతులను నాశనం చేయడంసైబర్ క్రైమ్స్స్మార్ట్ ఫోన్ తో మాయమౌతున్న బంధాలు అనుబంధాలుసోషల్ మీడియా సామాజిక చైతన్యహేతువా!?సామాజిక హీనత్వమా!?సహేతుక విశ్లేషణలుగ్రామ ,మండల,జిల్లారాష్ట్ర, దేశ సచివాలయాల తీరుతెన్నులుఇవి కదా!?కవులు ఏకరువు పెట్టవలసింది.వదరుబోతు మాటలు కాదుఉద్వేగాలు రెచ్చగొట్టడం కాదుఇవి కవి సమ్మేళనాల్లోతూచా తప్పకుండా కవితావస్తువులుగాస్వీకరించవలసింది.కవులు సంఘసంస్కర్తలైఆర్థిక అసమానతలు లేనిసమసమాజం స్థాపనకైకలం ఝళిపించిన నాడుకవి సమ్మేళనాలులోక కళ్యాణానికి దోహదమౌతాయిఅంతే తప్పాకాలక్షేపం కావొద్దువిజ్ఞుల సమ్మేళనాలు
కవి సమ్మేళనాలు :- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి