బస్సుల్లో వయోవృద్ధులకు
పసిపిల్లల తల్లులకు
వికలాంగులకు
వీరందరికి బాలబాలికలు యువతీయువకులు
సీట్లిచ్చి గౌరవించడం కూడా సామాజిక సేవే
చౌరస్తాల్లో ,రద్దీగా ఉన్న రోడ్లపై దాటలేక సతమతమయ్యే
వృద్ధులను, వికలాంగులను,
అంథులను చేయిపట్టుకొని
రోడ్డు దాటించడం కూడా సామాజిక సేవే
జాతరలు ఉర్సులు ఉత్సవాలు జరిగే ప్రదేశాల్లో
తప్పిపోయిన పిల్లలను, దారి మరచిన వయోవృద్ధులను
చేయిపట్టుకొని అడ్రస్ తెలుసుకొని వారిని గమ్యస్థానం చేర్చడం కూడా
సామాజిక సేవే
భవిష్యత్ భారతం నేటి యువతరం వీరికి లక్ష్యనిర్థేశ్యంచేయించి
ఆ దిశగా వారు అభివృద్ధి చెందుటకున్న అవరోధాలను తొలగించి,
వారికి ఆర్థిక వెసులుబాటు నిచ్చి వారి మోములో చిరునవ్వు చూడడం కూడా సామాజిక సేవే
అనాథలను , నిరాశ్రయులను అక్కున చేర్చుకొని
వారి జీవితానికో దశదిశ చూపడం కూడా సామాజిక సేవే
నిరాశ నిస్పృహతో
ఆత్మహత్యకు పాల్పడే ఆత్మవిశ్వాసలేమికలవారికి మనోధైర్యమిచ్చి
వారిని సంపూర్ణ మూర్తిమత్వ వికాస కేంద్రాల్లో చేర్చి
వారి మానసిక ఒత్తిడులు ఎలా అధిగమించవచ్చునో తర్ఫీదు నిప్పించి
వారిని కూడా దేశ ప్రగతికారకులుగా మార్చడం కూడా సామాజిక సేవే
ఇన్ని ఎలా?!
మానవ సేవే మాధవ సేవ కదా!
ఉత్తమోత్తమమైన మానవ జన్మను
సామాజిక సేవలో పుణీతం చేసినవారు
ప్రత్యక్ష దైవాలౌతారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి