నటినటులేమైనా
దైవాంశసంభూతులా!?
నటులేమైనా మనోవైజ్ఞానికవేత్తలా!
నటులేమైనా
వ్యక్తుల సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి దోహదకారులా!?
నటులేమైనా
నేడు కుటుంబ కథా చిత్రాలు తీసే దర్శక నిర్మాతలు ఎందరని,
విలవల వలువలు విప్పదీసే
దృశ్యరాజాలే కదా
కొన్ని సినిమాలు
నేడు కుటుంబం సమేతంగా చూడదగ్గ సినిమాలు ఏవి?!
పడక గదిలో జరిగే ముచ్చట్లు
మరీ పచ్చిగా వండివార్చే సినిమాలు
ఆ సన్నివేశాలతో
ఈ యువతను ఈనటగ్రేసరులు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు
కిరాతకుడు
రాక్షసుడు
మృగం
వంటి టైటిల్స్ తో టీనేజర్స్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు
నిర్మాతలు సినిమాల ద్వారా సభ్యసమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు
కాసులు దండుకోవడమే
ఏకైక వ్యాపార సూత్రంగా చేసుకొని
క్రైమ్, హార్రర్, స్మగ్లింగ్,
రాబరీ ,
ఏవగింపు కలిగించే లవ్ స్టుపిడ్ కంటెంట్ తో తీసేసినిమాలు
యువతను తప్పుదోవ పట్టిస్తుంటే
జరుగుతున్న, ముందు జరగబోయే అనర్థాలకు కారకులెవరు!?
చేతులు లేని వాడికి బుక్కడం నేర్పే సినిమా కథలు
చెత్త సినిమాలు
రీల్ స్టోరీస్
రియల్ గా మార్చుతున్న
శ్రద్ధలేని దర్శక శిఖామణులు
ఇటు బుల్లితెర నట్టింట్లో తగుదునమ్మా అంటూ
జీడి పాకపు సిరియల్స్ తో
గృహిణుల్లో కుట్ర కుతంత్రం ఒంపి కుటుంబ విలువలను గిరవాటేసే
బుల్లితెర డైరెక్టర్లు
ఇటూసినిమాటోగ్రఫీ , సెన్సార్ కమిటీ సభ్యులు చూసి చూడనట్టు వేసే ఆమోదముద్రలు
విడుదలైన మూడు వారాల్లో టికెట్ల రేట్లను నూటికి నూరు శాతం పెంచి
సినిమా ప్రేక్షకులను నిలువుదోపిడీ చేస్తుంటే?!
చూసి చూడనట్టు ఉన్న ఏలికలు .
ఆరోగ్యప్రదం కానీ
కంటెంట్ లెస్ సినిమాలను బహిష్కరిద్దాం!
రియల్ స్టార్స్ అంటే
మన తల్లితండ్రులు మన ఆచార్యులు , మనచుట్టూ ఉన్న సమాజం అన్న విషయం గుర్తుంచుకుందాం
సామాజిక న్యాయం
బాలకార్మికత్వం
యువ చైతన్యం
స్వయం కృషి
పరోపకారం
ఐకమత్యం
సమసమాజం
భిన్నత్వంలో ఏకత్వం
సౌభ్రాతృత్వం
సుభాషితం
మొదలగునవి టైటిల్స్ గా
తీసుకొని చిత్రాలు నిర్మించాలి
కానీ
మనలో ఉద్వేగాలను రెచ్చగొట్టే,
ఉన్మాదం పెంచే సినిమాలను బహిష్కరిద్దాం
సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చే
అనవసర కంటెంట్ ను కట్టడి చేద్దాం!
ఆరోగ్యవంతమైన రేపటి సమాజం కోసం నేటినుండే
సంస్కరణలు చేపడదాం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి