సావిత్రిభాయి పూలే - లతాశ్రీ -పుంగనూరు -9666779103
ప్రేమకు రూపం - స్త్రీలకు మార్గం
 సావిత్రిభాయి పూలే ... సావిత్రిభాయి పూలే 
ఆది గురువుగా అడుగులు వేసి,
 మార్గ దర్శిగా నిలిచింది. 
అక్షర సమరం చేసింది.... చేసింది చరితగ మారి నిలిచింది.... నిలిచింది.

!!ప్రేమకు!! 

విధ్యను ఆయుధముగా మలిచింది. 
ఆడబిడ్డ సంకెళ్ళను తెంచింది. 
అజ్ఞానులు చల్లిన బురదలో కలువ పువ్వుగా విరిసింది.... విరిసింది 
బాలిక చదువుకు మార్గదర్శకం అయ్యింది... అయ్యింది

(2) అమ్మా సావిత్రి ... నువ్వో రచయిత్రి
నువ్వు రాసిన కావ్య పూలే ... కవిత్వపూలే 
జగతికి ప్రేరణ నిచ్చింది ....నిచ్చింది
 సిరా ఇంకా ఆరలేదు. కథా ఇంక ముగియలేదు
నింపిన స్ఫూర్తి వెన్నుతట్టగా  మహిళా లోకము కదిలింది -- కదిలింది.

!!ప్రేమకు!!

(3) స్త్రీ విద్యకై పోరాడి..
 స్త్రీ వాదానికి తల్లిగా నిలచి 
విద్యా విత్తును నాటింది.. నాటింది 
జ్యోతిరావుకు నీడగ నడిచి.
పిల్లల మనసున జ్యోతిగ వెలిగి. చదువుల తల్లిగా మారింది.... మారింది 
జ్వలన మింకా తగ్గలేదు - గమ్యమింకా చేరలేదు
 జ్వలనమే దారిచూపగ కదిలేము ... మేముకదిలేము .!!ప్రేమకు!!


కామెంట్‌లు