మంచి మాటల మణిహారాలు: --గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
మంచితనం నీదైతే
సంస్కారం తోడైతే
జగమంతా బంధువులే!
అనురాగ సింధువులే!

మానవత్వం చూపితే
దైవత్వం పొందితే
ఎంతైనా మంచిదే
బ్రతుకులోన గౌరవమే

మితిమీరితే వాగుడు
అహర్నిశలూ సణుగుడు
చూడంగా హానికరము
దూరముంటే క్షేమము

లోపాలను వెదకరాదు
అవహేళన చేయరాదు
ఆశ్రయించిన వారికి
కీడు తలపెట్టరాదు


కామెంట్‌లు