చింతలేని చిన్నారులు: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
చిన్నారులు నవ్వితే
ఇల్లంతా వెలుగులు
వికసించిన పువ్వులై
వెదజల్లును సొగసులు

పసి పిల్లల మనసులు
సుతిమెత్తని తీగలు
పవిత్రమైన తలపులు
తేజోమయ తనువులు

ముద్దులొలుకు బాలలు
ముద్దబంతి సుమములు
తలపించును పరుగులు
సెలయేరుల గలగలలు

పిల్లలు బంగారము
ఇంటికి సింగారము
మంచికి చూడుతారు
వారే శ్రీకారము

చింతలేని పిల్లలు
గుబాళించు మల్లెలు
వారి ప్రేమకుండవు
ఏమాత్రం ఎల్లలు


కామెంట్‌లు