పెద్దల పసిడి పలుకులు: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
ఎవ్వరూ చూడలేదని
తప్పు మాత్రం చేయకు
అందరూ చేస్తారని
అప్పు చేసి పప్పు కూడకు

వయసులో పెద్దవారిని
అవహేళనే చేయకు
పనికిమాలిన వాటిని
కలనైనా  ఆశించకు

లేనిపోని గొప్పలకై
ఏమాత్రం పోబోకు
నీచ సుఖభోగాలకై
ఎప్పుడు అర్రులు చాచకు

ఉన్న దానితో తృప్తి
హృదయంలో స్వర్గమే
ఎంత ఉన్నా అసంతృప్తి
అడుగడుగునా నరకమే


కామెంట్‌లు