ఉండాలి ఉన్నతంగా:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
మహానుభావులుగా
ఉన్నత వ్యక్తులుగా
ఇల ఉండాలంటే
మూలం కృషియేగా

వెలిగే దీపంలా
పారే సెలయేరులా
ఉండాలి ఉర్విలో
విరిసే గులాబీలా

ఎవరెస్టు శిఖరంలా
ఆలయ గోపురంలా
ఉండాలి గొప్పగా
నలుగురికి స్ఫూర్తిగా

బ్రతికినంతకాలము
ఆదర్శమవ్వాలి
లేకపోతే వ్యర్థము
ఉండదోయి అర్ధము


కామెంట్‌లు