చురుకైన చీమలు: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
చిన్న చిన్న చీమలు
గురువులాంటి చీమలు
ముందుచూపు ఉన్నవి
జ్ఞానంలో మిన్నవి

క్రమశిక్షణ నేర్పును
సమైక్యతను చాటును
సృష్టిలోన చిన్నవి
పొదుపు విలువ తెలుపును

త్యాగానికి చిహ్నాలు
విలువైనవి గుణములు
స్వార్ధాన్ని వదిలేసి
చూపును ఘన ప్రేమలు

చీమలను గమనించు
నేర్చుకో పాఠాలు
బద్ధకాన్ని త్యజించు
చురుకుదనము చూపించు


కామెంట్‌లు