అంత్యాను ప్రాస పదాల ప్రబోధం:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
కోకిలమ్మ గానము
శ్రేష్టమైన జ్ఞానము
చేకూర్చును లాభము
మనసులోన ధ్యానము

మంచి వారి స్నేహము
బ్రతుకున తొలి స్థానము
ఉంటేనే మంచిది
కొన్నిసార్లు మౌనము

అందాల జీవితము
చేసుకోకు వ్యర్థము
కన్నవారి త్యాగము
చేసుకొమ్ము అర్ధము

మితిమీరిన కోపము
తెచ్చిపెట్టు నష్టము
ఎంతైనా క్షేమము
జీవితాన శాంతము


కామెంట్‌లు