చిట్టి పొట్టి పిల్లలు:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
గుడిలోని దీపాలు
వనంలోని కుసుమాలు
చిట్టి పొట్టి పిల్లలు
అందమైన బొమ్మలు

మంచికి రూపాలు
వర్షించు మేఘాలు
ముద్దులొలుకు బాలలు
ముద్దబంతి పూవులు

కన్పించు దేవతలు
ప్రేమ పంచు దాతలు
అందాల చిన్నారులు
మందార మాలికలు

గృహమున మాణిక్యాలు
చూడ అరవిందాలు
కల్మషం లేనివారు
పవిత్రమైన హృదయులు


కామెంట్‌లు