అమ్మ ఉంటే స్వర్గము: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
అమ్మ మాట తీయనిది
వెన్నెల్లా చల్లనిది
శ్రద్ధగా ఆలకిస్తే
జీవితాన్ని దిద్దునది

తల్లి మనసు తెల్లనిది
మల్లె వోలె మెత్తనిది
ఎల్లరికీ  విదితమే
పల్లెసీమ లాంటిది

అమ్మే మణిహారము
మమకారపు దుర్గము
సదనంలో దీపము
ప్రేమకు ప్రతిరూపము

అమ్మ లేని ఇంటిలో
ఆనందం శూన్యము
ఆమె ప్రేమ తోటలో
వ్యాపించు పరిమళము

అమ్మ ఉన్న స్వర్గము
మమతలకామె మార్గము
చూడు చూడు తల్లిని
గుండెలోని త్యాగము


కామెంట్‌లు