లక్ష్మీ పల్లి గ్రామంలో దత్తయ్య అనే పెద్దమనిషి ఉండేవాడు. గ్రామంలో ఎలాంటి సమస్యలైనా చిటికెలో పరిష్కార మార్గం చూపేవాడు. అందుకే గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా దత్తయ్య వద్దకు వెళ్లి పరిష్కార మార్గం వెతికేవారు. కానీ యువకులకు దత్తయ్య దగ్గరకు అందరూ వెళ్లడం నచ్చలేదు. ఎలాగైనా దత్తయ్యకు ఎదురు నిలవాలనుకున్నారు.
ఒకరోజు రెండు కుటుంబాల సభ్యులు దత్తయ్య వద్దకు వెళ్లారు. మా కుటుంబాలకు చెందిన ఆస్తి పంపకాలు ఎలా చేసుకోవాలో అర్థం కావడం లేదని, పరిష్కార మార్గం చూపమన్నారు. అక్కడికి యువకులు కూడా వచ్చారు. దత్తయ్య ఏదో చెప్పేలోగా ఆగండి మేమే చెప్తాం. ఈ సమస్యకు పరిష్కారం మేమే చేస్తాం. అంటూ ఉన్న భూమిని చెరిసగం పంచుకోమని చెప్పారు. దత్తయ్యతో పాటుగా రెండు కుటుంబాల సభ్యులు నవ్వారు. మేము చెప్పిందాంట్లో ఏం తప్పు ఉంది. చేరిసగం పంచుకోవడం న్యాయమే కదా అంటూ యువత చిర్రుబుర్రులాడారు.
చెరిసగం ఆస్తిపంచుకోవాలన్న విషయం రెండు కుటుంబాల వాళ్ళకు తెల్వదా, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇంత చిన్న విషయానికే నా దగ్గరికి ఎందుకు వస్తారంటూ దత్తయ్య యువతను ప్రశ్నించి, ఆస్తి పంపకాల సంగతి సరే కానీ తల్లిదండ్రుల సంగతి ఏంటని అడిగాడు. అందులో ఏముంది చెరొక్కరిని పంచుకుంటే పోలే అని యువత అన్నారు. దత్తయ్య కోపంగా యువత వైపు చూస్తూ, ఆస్తుల్లాగా మనుషుల్ని పంచుకోవడం కుదరదు. తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఆస్తి పంపకాలు జరగకుండా ఉంటే తల్లిదండ్రుల ఆయుషే పెరుగుతుంది. ఆస్తి పంపకం జరిగితే తల్లిదండ్రులు దిగులుతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్తారని, అందుకే రెండు కుటుంబాల వాళ్ళు కుటుంబాలుగా విడిపోయి, వేరు కాపురాలు పెట్టినా, తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఆస్తులు కలిసే ఉండాలని దత్తయ్య చెప్పాడు. రెండు కుటుంబాల వారు దత్తయ్యకు నమస్కరించి వెళ్లిపోయారు. యువత తన తప్పును తెలుసుకొని, దత్తయ్య చెప్పే కొన్ని న్యాయ పరిష్కారాలు వింటూ అనుభవంతోనే సమస్యల పరిష్కారం సులభమవుతుందని గ్రహించారు.
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి