నిరీక్షణ.:- భార్గవ్ సైదులు.-పెంచికల్ దిన్నె , సూర్యాపేట.9989023822.
 నాకు సొంతం కాని బంధం నువ్వు 
నేను మోయలేని జ్ఞాపకం నువ్వు 
నా హృదయం ఎంత తపన పడినా 
నా హృదయం ఎంత గాయాల వలయమైనా....
నేను అందుకోలేని ప్రేమవి నువ్వు 
నా జీవిత నిశీధిలో తొలి కిరణం నీవు 
నా ఆశల సౌధానికి పునాది నీవు
ఈ జన్మకు నీ దరి చేరలేని 
చకోర పక్షినై
ఆ కడలి అంచుల తీరంలా వేచి ఉన్న
కెరటమై వచ్చి నను చేరుతావని ఆశతో ఉన్న......
నేను దహించిన హృదయంతో
ఎడారి నేలనై ఎదురుచూస్తుంటే
నా గుండెలను బండల రహదారిగా చేసిన  నీ జ్ఞాపకాల రధాలు 
వాటిపైన అలుపెరగకుండా 
పరుగులు తీస్థూన్నాయి.....
ఈ జన్మకు ఈ ఎడబాటు నిరీక్షణతో 
పరితపించే కన్నీటిగాదతో 
నీవే లోకంగా నీ తలపే ధ్యాసగా
నిన్ను తలుచుకుంటూ కనులు 
మూసుకొని జీవిస్తున్నా....
కలలోనైనా కనిపిస్తావని...💞


కామెంట్‌లు