మార్గశిరం-మోక్షప్రదం:- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.
\మాసాలన్నింటిలోను మార్గశిర మాసం పవిత్రం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ.

శుక్ల తదియనాటి ఉమామహేశ్వర వ్రతం సంపత్కరం.

శుక్ల షష్ఠి సుబ్రహ్మణ్య ఆరాధన సత్సంతాన ప్ర్రాప్తి.

అష్టమి కాలభైరవ ఆరాధన అప మృత్యుభయం తొలగించి
ఆయుర్వృద్ధి కలుగచేయు.
వసుదైకానికే ప్రామాణికమైన
ఆదర్శజీవితానికి ఆధారమైన
భగవద్గీత జన్మదినం. మార్గశిర శుద్ధ ఏకాదశి.
అందుకే కృష్ణం వందే జగద్గురుమ్ అన్నారు.

స్వామి వివేకానంద, జాతిపిత మహాత్మా గాంధీ గీతయే అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పిన రోజు అతి పవిత్రం.

ముక్కోటి ఏకాదశి నాటి ఉత్తర ద్వారాదర్శనం  విష్ణు సహస్ర పారాయణ మోక్ష ప్రదం
ధనుర్మాస ప్రాతః కాల పూజ పాసురాల పఠనం
జీవన్ముక్తికి సోపానం.

మార్గశిర గురువారం లక్ష్మీ పూజ అత్యంత సౌభాగ్యప్రదం.

మార్గశిర పౌర్ణమి త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ జయంతి
పౌర్ణమి రోజు గురుచరిత్ర పారాయణ ఉపవాస దీక్ష ఆయురారోగ్యాలనిచ్చునని
నడయాడే పరమేశ్వర ప్రతిరూపమైన కంచి పరమాచార్య తెలియచేశారు.

కావున పవిత్ర నదీస్నానం ఆచరించి  దత్త దర్శనం అత్యంత మోక్షప్రదం...!!
.........................


.........................

కామెంట్‌లు