తన చెల్లి దేవకికి పుట్టే ఎనిమిదవ బిడ్డ వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని గ్రహించిన కంసుడు భార్యాభర్తలిద్దరినీ చెరసాలలో బంధించాడు. అంతేకాకుండా జైలు ద్వారానికి ఓ గాడిదను కట్టేశాడు. చెరసాలకు కాపలా ఉన్నవారిపై అతనికి నమ్మలేకే ఇలా గాడిదను కట్టించాడు. అలా కట్టించడం వెనుక ఓ విషయముంది. అదేంటంటే, గాడిదకు చాలా శక్తి ఉంది. బిడ్డ పుట్టగానే అది అరవడం ప్రారంభిస్తుంది. ఈ అరుపు వినపడటంతోనే ఆ ఎనిమిదో బిడ్డను చంపాలని కంసుడు అనుకుంటాడు. అంతకుముందు ఏడుగురు పిల్లలు ఇలానే చనిపోయారు.
కృష్ణుడు ఎనిమిదవ బిడ్డగా జన్మించాడు. వెంటనే, దేవకి భర్త వసుదేవుడు గాడిద కాళ్ళపై పడి, "దయచేసి అరవకు" అని వేడుకుంటాడు. గాడిద వసుదేవుడి మొరతో అరవలేదు. కృష్ణుడు పుట్టాడు. అందుకే "ఏదైనా జరిగితే గాడిద కాళ్ళను పట్టుకోండి" అనే మాట పుట్టింది.
అమృతేశ్వర ఆలయంలో, బయటి గోడపై గాడిద కాళ్ళపై పడుతున్న వసుదేవుడి శిల్పాన్ని చూడవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలో చిక్కమగళూరు పట్టణానికి దగ్గర్లో ఉన్న అమృత్ పుర అనే గ్రామంలో ఈ ఆలయముంది. హస్సన్ నుంచి 110 కిలోమీటర్లు, శివమొగ్గ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో 206వ జాతీయ రహదారిలో ఉందీ ఆలయం. ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ దేవాలయాన్ని 1196వ సంవత్సరంలో నిర్మించారు. హొయసల రాజు వీర బళ్ళాల II కాలంలో ఆయన సైన్యాధ్యక్షుడైన అమృతేశ్వర దండనాయకుడు దీనిని నిర్మించారు.
దేవాలయానికి విశాలమైన ముఖమంటపం ఉంది. ఈ ఆలయాన్ని హొయసల సామ్రాజ్య నిర్మాణ శైలి ప్రకారం నిర్మించారు. ఈ ఆలయానికి సహజమైన ప్రహరీ గోడ ఉంటుంది. అది కూడా సమానమైన జాగాతో వృత్తాకారంలో ఉండటం విశేషం. ఈ గుడికి ఒక విమాన గోపురం ఉంది. అలాగే ఒక మూసిన మంటపం ఉంది. అది ముఖ మంటపాన్నీ, గర్భగుడినీ కలిపే విధంగా ఆ రెండింటి మధ్య నిర్మించారు. హొయసల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ గుడి అదే శైలిలో నిర్మించిన బెలవదిలోని వీర నారాయణ ఆలయంతో పోలి ఉంటుంది. వీరనారాయణ గుడిలోలానే మంటప నిర్మాణం ఉంటుంది. ఇక్కడి ముఖ మంటపంలో నుంచి దక్షిణం వైపు ఉన్న మరో గర్భాలయంలోకి వెళ్ళవచ్చు. గర్భాలయం చతురస్రాకారంలో అచ్చం గోపురం ఆకారంలో ఉంటుంది. మూసిన మంటపాన్నీ, గర్భగుడినీ కలిపే సుకనాసీ మంటపం పైన హొయసల సామ్రాజ్య చిహ్నమైన సింహాన్ని చెక్కను గమనార్హం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి