ఓ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని దుకాణానికి వెళ్ళాడొకడు.
అతనికి అక్కడ లభించిన కొన్ని సమాధానాలు:
ఒక దుకాణం : స్టాక్ లేదు. ఇది వచ్చే వారం వస్తుంది.
దుకాణం 2 : ఈ కంపెనీ మూతబడింది. అదే కాంబినేషన్ తో మరొక కంపెనీ సరఫరా చేసిన ముందుంది...ఇమ్మంటారా?
దుకాణం 3 : ఈ మందుకు చాలా డిమాండ్ ఉంది. మీకు కావాలంటే నేను బ్లాకులో ఇస్తాను...ధర ఎక్కువవుతుంది
దుకాణం 4: మీ కుటుంబంలో ఎవరికి క్యాన్సర్ ఉంది?
ఈ మాటతో వినియోగదారుడు కంగుతిన్నాడు. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి అడిగాడు.... డాక్టర్ ఆ ప్రిస్క్రిప్షన్‌ను తీసుకుని చూసాడు.
"ఇది నేను రాసిన ప్రిస్క్రిప్షన్ కాదు. నేనొక కొత్త పెన్ను కొన్నాను. అది సరిగ్గా రాస్తోందో లేదో చూడటానికి నాలుగు ముక్కలు గీసాను. మీరు కాగితం మార్చి తీసుకెళ్తే నన్నేం చేయమంటారు.... ఇదిగో మీ ప్రిస్క్రిప్షన్" అంటూ కొత్త కాగితం వినియోగదారుడికి ఇచ్చాడు డాక్టర్.
- తమిళంలో చదివాను. ఎవరు రాసారో పేరు లేదు. నాకొకరు వాట్సప్ లో పంపగా తెలుగు మాటలు రాశానంతే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి