ప్రాస మంజరి పద్యాలు: - ప్రాసమంజరి రూపకర్త -డా. ధనాశి ఉషారాణి -భాకరాపేట తిరుపతి జిల్లా
భారతదేశం సంపన్నశ్రేష్ఠదేశం
ధీరవీరప్రజ్ఞా సుసంపన్నదేశం 
సంస్కృతీసాంప్రదాయ సౌభాగ్య దేశం
జగతికందించేవిజ్ఞానసందేశం.

ప్రేమానురాగాలనిధియీమాతృభూమి
మమతానురాగసుసన్నిధియౌయీభూమి
శాంతిసందేశపుసౌభాగ్యమాతృభూమి 

ఋషిప్రోక్తమీభూమిసుందరమైనభూమి
వేదభూమీపుణ్య ధర్మకర్మభూమీ
మనజన్మభూమీఘనమైన ధర్మ భూమి
విశ్వానికిచైతన్యము నందించు భూమి 

వీరులదౌఘనమైనభూమిమాతృభూమి
త్యాగధనుల రక్తతర్పితమీసుర భూమి
సంపూర్మభాస్కరతేజజతుల్యమీభూమి
కార్యదీక్షతలధర్మరక్షితసద్భూమి
                                         

ధర్మచింతసత్యచింతనభారతీయత
న్యాయదీక్షతధర్మదీక్షభారతీయత
ఋజుమార్గమందాచరణయెభారతీయత
చైతన్య సంతర్పణతే భారతీయత
                                    

పరోపకారసహన శీలభారతీయత
దైవచింతితధర్మరక్ష భారతీయత
కర్తవ్యదీక్షన్యాయచింతభారతీయత
సమన్యాయంసమధర్మమెభారతీయత.  

మానవత్వశోభితసుమమెభారతీయత
ధర్మాచరణసమపాలనభారతీయత
న్యాయ రక్షణధర్మశిక్ష భారతీయ త
మమతానురాగమరందతభారతీయత. 


కామెంట్‌లు