శ్రీ త్యాగరాజ గాన సభలో గురువారం మహర్షి వాల్మీకి సంస్థ ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షులు డాక్టర్ .వి.డి రాజగోపాల్ పుట్టిన రోజు సందర్భంగా వారు వ్రాసిన "ఎర్ర సింధూరం యాడబాయ తల్లి" నాటకాన్ని ప్రదర్శించారు...
ఇందులో ఒక ప్రధానమైన"పాపారాయుడు పాత్రలో " ప్రముఖ కవి పోలయ్య కూకట్లపల్లి అందమైన గెటప్ తో చక్కని హావభావాలతో...ఆకట్టుకునే డైలాగ్ లతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు...మరో ప్రముఖమైన భూపతిరాయుడి పాత్రలో సాధనాల వేంకట నాయుడు...చెన్నమ్మ పాత్రలో సురభి ప్రియాంక జీవించారుఇంకా ఇతరత్రా పాత్రల్లో అందరూ తమ నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు...శరత్ చంద్ర సందర్భోచితమైన సంగీతం అందించారు... ప్రతి ఒక్కరూ నాటకం విజయవంతం కావడానికి ప్రాణం పెట్టారుసభకు అతిరథ మహారథులు హాజరై నాటకాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా వీక్షించి ఆనందించారు...
చక్కని సినిమా గీతాలకు చలాకి స్టెప్పులతో రాధా గోపి, పాతపాటలకు సుకుమారమైన అభినయంతో మద్దిలేటి చెన్నమ్మ కనువిందు చేశారు ప్రేక్షకుల ప్రశంసలు పొందారుచెన్నమ్మ అభినందన సభలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రదర్శించిన దుర్యోధన శ్రీకృష్ణ పాత్రధారులు చక్కని గెటప్ లతో కనువిందు చేశారు వారి పద్యాలతో హావభావాలతో హాలు దద్దరిల్లింది...
డా. వి.డి రాజగోపాల్ అందరినీ స్పెషల్ గిఫ్ట్ బ్యాక్ లతో సత్కరించారు...అలాగే ఆరంభంలో అరవా రవీంద్రబాబు నిర్వహణలో జరిగిన కవిసమ్మేళనంలోకవితాగానం చేసిన కవులను నటులను శాలువాలతో అందమైన మెమొంటోలతో
ఘనంగా సన్మానించారు
ఈ సందర్భంగా పాపారాయుడు పాత్రకు న్యాయం చేసిన పోలయ్య కూకట్లపల్లినిడా. వి.డి రాజగోపాల్ కళారత్న డా బిక్కికృష్ణ
సినీ డైరెక్టర్ రేలంగి నరసింహారావుఘనంగా సన్మానించారు...పోలయ్య కవి మాట్లాడుతూ గురుదేవులు కళారత్న
డా. బిక్కి కృష్ణ తనలోని కవిని గుర్తిస్తేడా. విడి రాజగోపాల్ తనలోని నటున్ని గుర్తించారని ఇంతగా ప్రోత్సహించిన వారికి నా కృతజ్ఞతలు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇంకా ఈ సభకు విశిష్ట అతిథులుగాఎం నరసింహప్ప..కళారత్న డా.బిక్కీకృష్ణడా.జల్ది విద్యాధర్ డా.నాళేశ్వరం శంకరం రవిశంకర్..రేలంగి నరసింహారావు...రాము విజయలక్ష్మి పండిట్...ఏ.ఎల్ కృష్ణారెడ్డి...డా. రాధా కుసుమ...ప్రయోక్త ఆశాలత...మోచర్ల డా.శాంతిశ్రీ తదితరులు హాజరయ్యారునాలుగు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది ఆహుతులందరు రాజగోపాల్ గారికి పుట్టినరోజు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఆశిస్సులు అందించారు చక్కని విందుభోజనంతో సభ దిగ్విజయంగా ముగిసిందిఅందరికీ మరిచిపోలేని ఒక తీపి జ్ఞాపకంగా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి