పండిత పామరులను తన రచనల ద్వారా ప్రేరణనిచ్చిన కవి చిలకమర్తి
నాటకకర్తగా,పాత్రికేయునిగా విద్యావేత్తగా, సంఘసంస్కరణకర్తగా వినుతి కెక్కిన ప్రజ్ఞాశాలి.
ఇరవైరెండు సంవత్సరాల ప్రాయంలో వ్రాసిన గయోపాఖ్యానం నాటకం తెలుగు సాహిత్యంలోనే ప్రభంజనం.
కాదేది కీర్తికి అనర్హం అన్నదానికి ప్రతీకగా తన స్వీయచరిత్రను చూపు లేనప్పటికీ వ్రాయించి భావి తరాలకు మార్గదర్శనమైన సరస్వతీమాత మానసపుత్రులు.
అన్నదానం, వస్త్రదానం, గృహదానం, భూమిదానంల కంటే విద్యాదానం గొప్పదని చదువు ప్రాధాన్యత తెలియచేసిన విద్యావేత్త.
భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చు చుండ యన్న పద్యం ద్వారా తెల్లదొరల పాలనను వ్యతిరేకించిన దేశభక్తుడు .
.
సరస్వతి పత్రిక సంపాదకులుగా సౌందర్య తిలకం, పార్వతీ పరిణయంలు వ్రాసి అందించిన రచయిత.
గణపతి నాటకంలో హాస్యభరితమైన గణపతి పాత్ర నేటికి చిరస్మరణీయం.
హరిజనులకోసం కులమత వర్ణవివక్షత పోవడం కోసం కందుకూరి వలె పోరాడిన సంఘ సంస్కర్త చిలకమర్తి
బహుముఖ ప్రజ్ఞాశాలి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి ప్రతిభను ఆంధ్రవిశ్వవిద్యాలయం అత్యుత్తమ కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించెను.!!
...........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి