వన పర్వము పంచమాశ్వాసము126 వ రోజు
దుర్యోధనుని అవమానభారం
ఇంతవరకు కథను వింటున్న జనమేజయుడు వైశంపాయుని చూసి " మహర్షీ! ఎల్లప్పుడూ పాండవులకు హాని తలపెట్టే దుర్యోధనుడు శత్రువులచే బంధింపబడి పాండవులచే రక్షింపబడిన అవమాన భారాన్ని ఎలా భరించాడు. భరించి ఎలా హస్తినకు చేరాడు " అని అడిగాడు.
హస్థినాపురం
హష్తినాపురవాసి అయిన బ్రాహ్మణుడు ద్వైతవనానికి వెళ్ళి పాండవులను కలుసుకుని తిరిగి హస్థినకు వెళ్ళాడు. దృతరాష్ట్రుడు ఆ బ్రాహ్మణుని చూసి పాండవుల యోగక్షేమాలు విచారించాడు. ఆ బ్రాహ్మణుడు పాండవులు ద్రౌపది అడవులలో పడే కష్టాలు వివరించాడు. దృతరాష్ట్రుడు అది విని ఎంతో దుఃఖించాడు. " అయ్యో! నా కుమారుని దుర్నీతి వలన కదా ఇంత కష్టం దాపురించింది. దీనికంతకు నాచేతకాని తనమే కారణం. ధర్మరాజును నా పెద్ద కొడుకుగా భావిస్తాను అతనికి బ్రహ్మదేవుడు ఎన్ని కష్టాలు రాసాడు. హంసతూలికా తల్పంపై నిదురించే ధర్మరాజు కటిక నేలపై నిదురిస్తున్నాడు కదా. అనిల కుమారుడు అతి బలవంతుడైన భీముడు అడవి సింహంలా వనాలలో తిరుగుతున్నాడు కదా. అన్నదమ్ములు ద్రౌపది పడుతున్న కష్టాలు చూసి అర్జునుడు మనసులో రగిలి పోతున్నాడు కదా. సుకుమారులైన కవలలు అడవులలో ఎన్ని కష్టాలు పడుతున్నారో. వాయు పుత్రుడైన భీముడు అతి బలవంతుడైనా అన్న మాటకోసం అరణ్యవాసం చేస్తున్నాడు కాని లేకున్న అతనిని ఆపడం ఎవరి తరం. శకుని వంచన, దుశ్శాసనుని దుశ్చర్యలు, కర్ణుని తులువతనం, దుర్యోధనుని అనీతి అతని మనసులో ముల్లులా గుచ్చుకుంటున్నాయి కదా. భీముని చేతిలో నా కుమారుల మరణం తప్పదేమో. కర్మఫలం అనుభవించక తప్పదు కదా. ఏమి చేయుదును విచారించిన ఏమి ఫలం నేను ఎంత వారించినా జూదం ఆపలేక పోయాను. కష్టముల వెంట సుఖాలు వస్తాయి అంటారు కదా. అర్జునుడు పరశివుని మెప్పించి పాశుపతాన్ని సాధించాడు. సశరీరంగా స్వర్గానికి పోవడమే కాక ఇంద్రుని అర్ధ సింహాసనం అధిష్టించాడు. అర్జునుడు ఏ జన్మలో చేసిన పుణ్యమో కదా " అని పరి విధాలుగా విలపించేడు. దుర్యోధనుడు అది చూసి "మామా! మా తండ్రిగారు ఇలా భీతిల్లుతున్నాడు. దీనిని గురించి ఆలోచించ వలెను " అన్నాడు. వారిరువురు కర్ణునితో చేరి ఏకాంతప్రదేశంలో మంతనాలు జరిపారు. కర్ణుడు " సుయోధనా పాండవుల సంపదలన్నీ నీ వశమైనాయి. వారు అడవుల పాలయ్యారు. రాజులంతా నీకే కప్పం చెల్లిస్తున్నారు. సార్వభౌముడివైన నీ పాలన ప్రజామోదాన్ని పొందింది. నీవు ద్వైత వనానికి వెళ్ళి అక్కడ ఇడుములు పడుతున్న పాండవులకు నీ భోగభాగ్యములు ప్రదర్శించి వారికి ఖేదము కలిగించ వలెను. అలాగే వారు పడుతున్న కష్టములు చూసి ఆనందించి మన జన్మ సాఫల్యం పొందవచ్చు. ద్రౌపది నీ భార్యల సౌభాగ్యం చూసి దుఃఖించ వలెను " అని దుర్యోధనునితో అన్నాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి