రామస్వామి వెంకట్రామన్ పుదుకోటైలో 4డిసెంబర్ 1910లో పుట్టారు.తండ్రి రామస్వామి అయ్యర్ తంజావూరు లో ప్రసిద్ధ వకీలు.వెంకట్రామన్ లా చదివి మద్రాస్ హైకోర్ట్ లాయర్ గా ఆపై 1951లో సుప్రీంకోర్టులో రాణించారు.భార్య జానకీదేవి ముగ్గురు కూతుళ్లు .17ఏళ్ల ఏకైక కుమారుడు చనిపోటం బాధాకరం.ఇక అడ్వకేట్ గా ఆయన సాధించిన విజయం ఏమంటే,కొందరు ఆంగ్ల ఆఫీసర్ని హత్యచేశారు. ఆయువకుల తరుఫున వాదించిన సి.రాజగోపాలాచారి ఓడిపోతే,వెంకట్రామన్ పోరాడి ఇంగ్లాండ్ వకీలు సాయంతో వారికి ఉరిశిక్ష పడకుండా కేసుగెలిచాడు. అలా అందరిదృష్టినాకర్షించిన ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో 2ఏళ్లు జైల్లో ఉన్నప్పుడు పుస్తకపఠనంలో గడిపారు.1944లో కామరాజ్ నాడార్ తో పరిచయం పెద్ద మలుపు.శ్రామిక పక్షాన ఆయన కృషితోపాటు*లేబర్ లా జర్నల్* పత్రిక ప్రారంభించాడు. తమిళనాడులో కాగితం,అల్యూమినియం, సిమెంట్ ఫ్యాక్టరీలు నెలకొల్పారు.ఇందిరాగాంధీ టైంలో రక్షణ మంత్రి గా,రాకెట్ మిసైల్ టెక్నిక్స్ కి ఊతమిచ్చారు.అబ్దుల్ కలాం ప్రతిభను గుర్తించి అంతరిక్ష అనుసంధానవిభాగంలో నియమించారు.ఈయన హయాంలో 4గురు ప్రధాన మంత్రులు_వి.పి.సింహ్,చంద్ర శేఖర్,రాజీవ్ గాంధీ,పి.వి.నరసింహ్మారావు పనిచేయడం విశేషం.25 జులై 1992 లో రిటైరైనాక రెండుగంటలలోపే రాష్ట్రపతి రాష్ట్రపతిభవన్ ని విడిచి కుటుంబంతో సహా మద్రాస్ వెళ్లిపోయారు.ఆయన మంచి రచయిత. తన 98వ ఏట27 జనవరి 2009లో స్వర్గస్థులైనారు🌷
రామస్వామి వెంకట్రామన్!:-అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి