ఒకసారి, శ్రీరంగంలో ‘కృష్ణ అవతారం’ గురించి రామానుజులవారు తన ఉపన్యాసంలో చెప్తూ చెప్తూ, కృష్ణుడు అడిగిన తన ఉతికిన బట్టలను ఇవ్వడానికి నిరాకరించిన చాకలి ఉదంతాన్ని ప్రస్తావించారు. అయితే ఆరోజు రాత్రి, ఒక చాకలి అతను రామానుజులవారి వద్దకు వచ్చి, “కృష్ణుడికి ఉతికిన బట్టలు ఇవ్వనని చెప్పిన ఆ చాకలి తరఫున నేను క్షమాపణలు కోరుతున్నాను. కాబట్టి, నేనే రంగనాథుడి బట్టలు ఉతికిస్తాను” అని అన్నాడు.
“సరే అలాగే కానియ్” అని రామానుజులవారు అతనితో అన్నారు.
మరుసటి రోజు నుంచి అతను రంగనాథుడి వస్త్రాలు ఉతికి, రామానుజులవారికి చూపించిన తర్వాత ఆలయానికి ఇస్తూ వచ్చారు. రామానుజులవారు కూడా అతనిని హృదయపూర్వకంగా అభినందించేవారు.
ఒక రోజున ఆ వ్యక్తి రామానుజులవారితో,
“మీరు నన్ను ప్రశంసిస్తున్నారు. బాగానే ఉంది కానీ ఆ రంగనాథుడు నన్ను కొనియాడారు లేదుగా” అని బాధపడ్డాడు.
వెంటనే రామానుజులవారు అతనిని రంగనాథుడి వద్దకు తీసుకెళ్లి,
“స్వామీ! ప్రతిరోజూ మీ కోసం వస్త్రాలు ఉతికి తీసుకొస్తున్నది ఇతనే ! మీరొకసారైనా అతనితో మాట్లాడితే బాగుంటుంది కదా?” అని అన్నారు.
వెంటనే రంగనాథస్వామి అతనితో,
“ అలాగా, నీకేం కావాలి అడుగు!” అన్నారు.
“స్వామీ, కృష్ణుడి అవతారంలో,
అతను కృష్ణుడికి ఉతికిన బట్టలు ఇవ్వనని చెప్పాడు. అతనిని మీరు క్షమించి మోక్షం ప్రసాదించాలి!” అని అడిగాడతను.
“నేనతనిని క్షమించాను. అయినా నేనా విషయాన్ని అప్పుడే మర్చిపోయాను” అన్నారు రంగనాథ స్వామి.
రంగనాథస్వామి, చాకలి మధ్య జరుగుతున్న సంభాషణను వింటున్న రామానుజులవారు, “కృష్ణుడి అవతారంలో తప్పు చేసిన వ్యక్తికి మోక్షం ఇవ్వమని కోరిన నువ్వు నీకెందుకు అడగలేదు?” అని అడిగారు.
అప్పుడు చాకలతను “ఆ సంగతి మీరే చూసుకుంటారు స్వామీ" అన్నాడు.
ఈ మాట విన్న రామానుజులవారు చలించిపోయి అతనిని ఆశీర్వదించారు.
నిజమైన భక్తులు ఇతరుల గురించి ఆందోళన చెందుతారు తప్ప తమ గురించి ఆలోచించరనడానికి ఇదొక ఉదాహరణ. అలాంటి వారు ఆ విషయాన్ని తమ గురువుకే వదిలివేస్తారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి