సుప్రభాత కవిత : - బృంద
ఏడు గుర్రాల తేరట 
ఏడు రంగుల తెలుపట 
ఏడులోకాలను మేలుకొలిపే
ఎదురులేని దైవమట!

వేయి కిరణాల మాలియట 
వేవేల వత్సరాల దైవమట
వేకువతో వెలుగులు పంచే 
వేలుపుగా పూజలందునట!

ప్రాగ్దిశ ను ప్రభవించి
ప్రాణికోటిని పరిరక్షించి
ప్రత్యూషమును పర్వముగా
ప్రతిదినమూ ప్రకాశించునట!

ఆగమనమే అదృష్టమట
ఆలస్యము చేయడట
ఆదిదైవముగా కొలుతురట 
ఆగని కాలమే అతని తీరట!

ఋతువులకు కర్తగా 
క్రతువులకు సాక్షిగా 
బ్రతుకుబాటను నడిపించే 
జ్యోతి కలశం తానట!

ఆరోగ్య ప్రదాతయట 
ఆదిత్య నామధేయమట 
ఆకాశమున నడయాడే 
ప్రత్యక్ష నారాయణుడట

నమస్కారములతో 

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు