"తిరుపతి బాలసాహితోత్సవం సభ" కు వక్తగా గద్వాల సోమన్నకు ఆహ్వానం

 నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలసాహిత్యవేత్త,బాలబంధు గద్వాల సోమన్న  ఈ నెల 17న  పిల్లల ప్రపంచం, సైన్స్ సెంటర్, తిరుపతి లో జరిగే "సాహితీ సంక్రాతి -బాలానందం -బాలసాహితోత్సవం" కు వక్తగా  ఆహ్వానం.బాలకవిమిత్ర గద్వాల సోమన్న ఈ సభలో "బడిలో బాలసాహిత్యం"అనే అంశంపై మాట్లాడనున్నారు."బాలల నేస్తం" మాస పత్రిక తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సాహితీ పండితులతో పాటు గణితోపాధ్యాయుడు గద్వాల సోమన్న పాల్గొనడం గమనార్హం."మట్టి పరిమళం " వీరి 89వ పుస్తకాన్ని కూడా విచ్చేసే ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు.
కామెంట్‌లు