సింగారం గ్రామానికి చెందిన యువకుడు వాసరవేణి శ్రీ వివేక్ రాసిన "విజేత చిత్రకారుడు" కథను జాతీయ కథా పోటీల్లో ఎంపిక చేసి 'బాల చెలిమి' పత్రికలో ప్రచురించి అరుదైన గౌరవం కల్పించి ప్రశంసా పత్రం అందించారు.
వాసరవేణి శ్రీ వివేక్ సింగారం గ్రామానికి చెందిన బాలసాహిత్య రచయిత డా.వాసరవేణి పర్శరాములు - జ్యోతి ల కుమారుడు. శ్రీ వివేక్ బాసర త్రిబుల్ ఐటీ లో ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. బాల్యం నుంచే రచనలు చేయడం, చిత్రాలు వేయడం అభిరుచిగా ఎంచుకున్నారు. వివేక్ రాసిన50కి. పైగా కవితలు, 40కి పైగా కథలు, 100కు పైగా చిత్రాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పలువురి ప్రశంసలు, సత్కారాలు అందుకున్నారు. రచయితలు డా.జనపాల శంకరయ్య, దుంపెన రమేశ్, ఫణి లక్ష్మణ్, వాసరవేణి దేవరాజు, ధనరాజ్, నీలకంఠం తదితరులు అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి