అలలు పాడే గీతాలతో
అలారారే కడలికి
కలలు చెదిరిన కనులు పాడే
మౌనగీతం తెలిసేనా?
పడిలేచే కెరటం చూసి
వడి మార్చి అడుగేయమని
నిరాశ కే నిరాశ పుట్టేలా
నిలిచి చూపమనే పాఠం!
పదములు లేని
స్వరములు కూర్చని
నిరాశ నిండిన రాగం
నింగికి వినిపించేనా?
ఓటమి చూసిన జగతికి
జవాబుగా మన విజయం
సందడి చేస్తూ వినిపించేలా
శ్రమించమని తెలిపే పాఠం
మనకోసం ఏదో ఉందని
మనకంతా మంచే నని
మనమంటూ ఉంటేనే కదా
మనుగడ సాగేది!
సాయం లేనే లేదని
సహకారం దొరకలేదని
నొచ్చుకున్న మనసుకు
ఇచ్చే ధైర్యం రేపన్న మాటే!
వెలుగన్నది ఒక వరం
వేకువ ఒక నమ్మకం
అడుగులతో సహగమిస్తూ
సాగిపోయేదే జీవితం!
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి