తెలుగు భాష కల్చరల్ అసోసియేషన్ అధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం కవితా పోటీ




 తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలును ముందుకు తీసుకుపోతూ దేశ ప్రగతికి ఉనికి కి మూలము బాలిక అనే ఉద్దేశంను బలము చేకూర్చుతూ నేటి సమాజమును ప్రశ్నించే రీతిలో కలాలకు పదును పెడుతూ  చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన తెలుగు భాష కల్చరల్ అసోసియేషన్ డా . యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా.ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు నిర్వహణలో నిర్వహిoచిన నేటి బాలిక అనే అంశము మీద జరిగిన జాతీయ బాలికా దినోత్సవం కవిత్వం పోటీలో 50 మంది కవులు పోటీలో పాల్గొని చక్కని కవితలు అందించడం జరిగింది. పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రములును అందించడము జరిగింది. పోగ్రామ్ కల్చరల్ వింగ్ కవిత్వపు సపోర్టరుగా యం. ధనలక్ష్మి వ్యవహరించారు. కవితా పోటీలో పాల్గొన్న అందరికీ నిర్వాహకులు డా. ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు