పోగమంచు పారిపొక తప్పదు
కిరణపు పోటు తిన్నాక
తెలిమంచు కరగక తప్పదు
నులివెచ్చని వేడి తాకాక!
కలతల చీకటి తెరలు
తొలగక తప్పదు
కలలు తీరే తరుణం
కనుల ముందు తోచాక!
ఋతువులు కూడా
మారక తప్పదు
ఆకులు రాలే శిశిరం
ఆగిపోదా ఆమని వచ్చాక!
ఎదురొచ్చే నిరాశలు
తప్పుకుపొక తప్పదు
అలుపులేని పోరాటానికి
ఇరుసల్లే ఆశ ఉన్నాక!
వేచి చూసే హృదయానికి
వేడుక దొరకక తప్పదు
వేదన వెనువెంటనే
వెలుగు వచ్చే తీరును కనుక!
బ్రతుకు పయనం
సాగక తప్పదు
కాలపు తీర్పులు
అనుసరిస్తూ......
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి