జ్ఞానీ జైల్ సింగ్ ! : - అచ్యుతునిరాజ్యశ్రీ

 పంజాబ్ లో సంధవాన్ లోకిషన్సింహ్ ఇందుకౌర్ ఆఖరిసంతానం జైల్ సింగ్ 5మే 1916 లో పుట్టాడు. చాల బీదకుటుంబం పైగా 11నెలల పసివాడైన  జైల్ సింగ్ తల్లి చనిపోటంతో పిన్నిదయాకౌర్ పెంచింది.ఆమెను కన్నతల్లి గానే భావించాడు. 16వ ఏట కన్నతల్లి కాదని తెలిసింది ఆపిల్లాడికి.చెక్కపనిచేసేతండ్రి గురుగ్రంథసాహబ్ ని చిన్న గూట్లోపెట్టి ఇంటిపై ఇంటిపైసిక్కుపంథ్ నిశాన్ సాహెబ్ జెండా పెట్టిన మతవిశ్వాసం కలవాడు.తండ్రి బాల్యంనుంచీ సిక్కు సంప్రదాయం భక్తి నేర్పటంతో 5ఏళ్ల జైలూ గ్రంథసాహెబ్ ని గడగడ అప్పజెప్పటంతో అంతా ఆశ్చర్య పోయేవారు. బడికి వెళ్లకుండానే హిందీ ఉర్దూలో నిష్ణాతుడైనాడు.12వ ఏట జబ్బుపడటంతోతండ్రి దిగులుపడ్డాడు.కొడుకు బతికి బట్ట కడితే సిక్కుపంథ్ లో గురుద్వారాకి బాలుడిని అప్పగించాడు. అప్పటినుంచి 13_14 ఏళ్ల వయసులో జ్ఞానీ అని పిలిచేవారు.అదే రాష్ట్రపతి ఐనా అలాగే పిలువబడ్డాడు.ఇక ఆయన 5వ ఏట 2 ఏళ్ల పాప ప్రధాన్  కౌర్ తో పెళ్లి నిశ్చితార్థం జరిగింది.మొండికేసిన ఆయన తన18వ ఏట తాళి కట్టాడు. ఫరీద్ కోట్ రాజా  ఆంగ్లేయులతో కల్సి జనాల్ని పీడించటంతో,ఆయన అకాలీదళ సభ్యుడై పోరాటం ప్రారంభించాడు. జైలుపాలైనాడు. 1943లో లాహోర్ లోమాస్టర్ తారాసింహ్ ని కలవటం ఓమలుపు.1972  లో పంజాబ్ ముఖ్యమంత్రి ఆపై 1982  ,లో  భారత్ కి 7వరాష్ట్రపతి ఐనారు.29  నవంబర్1994లో రోడ్ ప్రమాదంలో 27రోజులు కోమాలో ఉండి 25డిసెంబర్ 1994లో అమరులైనారు🌷
కామెంట్‌లు