కొండల మధ్య
కొత్తగా వెలుగుతూ
మబ్బులదారిలో
మెరుపులు చిమ్ముతూ...
ఏడు గుర్రాల తేరులో
ఏడు లోకాలకు రేడుగా
ఏడు దినముల వారపు
తొలి నాటి వెలుగులో.....
చలిని తరిమేయాలని
మంచును కరిగిస్తూ
తొలి సంధ్యలో మెరియు
తుషారబిందువుల చూస్తూ...
సర్వ దేవతలు
తనలో కొలువుండగా
ఉర్వి జనుల బ్రోవ
ఉదయాద్రి పై ప్రభవిస్తూ..
నింగిలో ఊరేగి
నిఖిల జగమునకు
క్షేమమును కూర్చు
దివ్య ధ్యేయముతో.....
కంటకపు దారిని
కల్హారములతో నింపి
కలలు తీరు దోవలో
కరము పట్టి నడిపించు
కర్మసాక్షికి నమస్సులతో
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి