ఓ మహాత్మ.....!
ఓ మహర్షి....!!
మహోన్నత మైన సత్య మహిమహింసల
దారులు జూపి....జాతి పితవె నీ వైనావు....!
ఒక చెంపను కొడితే... రెండో చెంపను చూపిన మహోన్నతుడ వీవయ్య !!
ఎంద రెందరో....ఎన్నెన్నో త్యాగాలు చేసినా...
ఖ్యాతిని నీవే దక్కించు కున్నువు...!!
ఎదుటి వారు హింస, దౌ ర్జన్యాలకు తెగబడినా....
శా0తి శా0తి అహింస అంటు... మన వారికే బోధలు చేసావు...!
స్వతంత్ర్యం కోసం పోరాటా లవి ఎన్ని చేసినా
ఏ పదవులను ఆసిం చని...
నిష్కామ కర్మ యోగివి నీవు...!
నీ సిద్దాంతాలలో...
సమ న్యాయం, సమ ధర్మం కొరవడి...అవి చివరికి నీ ప్రాణాలనె బరగొన్నా....
హే రాం... హే రాం అం టు....
ప్రాణాలను విడిచిన... మహ నీయునివే నీవయ్యా....!!
ఓ మహాత్మ... ఓ మహర్షి....! మీ కివే... మా పాదాభి వంద నములు.!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి