పుస్తకాల పండుగ: - డా. అరుణ కోదాటి

(ఈమధ్య హైదరాబాద్ లో జరిగిన పుస్తక ప్రదర్శన సందర్బంగా )

శీతాకాలo లో సంక్రాంతి పెద్ద పండుగ 
పుస్తక ప్రియులకు మాత్రం
 పుస్తక ప్రదర్శనే పెద్ద పండుగ.

అతివలు అంతచలిలోనూ 
వాకిట పెద్ద పెద్ద ముగ్గులు వేస్తే,
పుస్తక ప్రియులు మాత్రం 
ఎముకలు కొరికే చలిని కూడా 
 లెక్క చేయకుండా 
వారం రోజులు జరిగే పుస్తక ప్రదర్శనను సందర్శిస్తారు.

సాహిత్యప్రియులనుఎదనలరించే 
పుస్తకాల జాతరలు మస్తకాలకు 
విందులు.

భాగ్యనగరంలో పురివిప్పుకునే
 కొత్త కొత్త పుస్తకాల అత్తరు పరిమళాలు 
పుస్తకప్రియులు పవలింపు 
సేవలు చేసి వీడ్కోలు చెప్పుతారు.

జనజాతర్ల లోని రక రకాల 
రంగుల రాట్నాల మాదిరే 
పుస్తకజాతర్ల లోనూ 
బండెనక బండి కట్టినట్టుగా
 స్టాల్స్ కొలువు తీరుతాయి 
రంగుల రాట్నం తామే తిరు గు తాయి.
పుస్తకాల జాతర జనాన్ని తమ చుట్టూ తిప్పుకుంటాయి.

రంగుల రాట్నంమనల్ని బాల్యపు
 జ్ఞాపకాలలోకి తీసుకెళ్తే,
పొత్త గుడిలోని కావ్యాలు 
కవుల కలాల సాయంతో
 కాలాన్ని వెలిగించి 
మనల్ని కలల ప్రపంంచంలో కి 
తీసుకెళ్తాయి.

దేవుడి గుడి ఆత్మ ప్రకాశానికి,
పొత్తపు. గుడి మానసిక వికాసానికి 

దేవాలయాల్లో మంగళ వాయిద్యాలు,
 కర్పూరహారతులు.
పొత్తపుగుడిలో నన్నయ్య, 
మొదలు నవ్య తెలుగు కవులు 
ఎదురవుతారు.

దేశాల, రాష్ట్రాల సరిహద్దులు ఉండవు,
కుల, వర్గ, మత బేధాలుండని 
పవిత్ర ప్రదేశం పుస్తాకాలయం 
అదే  పుస్తకాల ప్రదర్శన.

కావ్యాలు బుద్దిని ఆకట్టుకుంటే,
కన్నీళ్లు గుండెను పట్టి ఊపుతాయి.
రెండూ చేరి మనిషిని కదిలిస్తాయి.

' మీకంటూ ఓ మెదడుంది 
దానికి కాసింత మేత పెట్టు " 
అని చలం చెప్పాడు.

" చదవడం మానేసిన రోజునుండీ
నువ్ మరణించడం ఆరంభిస్తావ్ " 
అని పాట్లోనెరుడా హెచ్చరిస్తాడు 
ఆర్తితో ఆత్మీయంగా పొంగివచ్చే 
తడిఆరని తల్లి భాషగుండెను తడుముతుంది.

" నా పుస్తకంతమనెంతో ప్రభావితం చేసిందని ఎవరైనా వచ్చి
 చెబితే.. నాకు కలిగే ఆనందం, సంతృప్తి, నోబెల్ కు ఏమితీసిపోవు.అన్న 
కవుల చిరకాల వాంఛలను ఆ రసజ్నులే తీర్చగలుగుతారు.

ప్రతి ఇంటిలో ఒక గదిని గ్రంధాల యంలామార్చుకుoటే,
ఆ యింట దేవుని గది లో కొలువై ఉంటే,
ఆ గదిలో సరస్వతీ దేవి  కొలువై 
ఉంటుంది.
కామెంట్‌లు