పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
సంక్రాంతి మూడు రోజుల పండుగ గూర్చి అంతర్జాలం ద్వారా కవితలను ఆహ్వానించగా తిరుమలరావు పంపిన భోగాల సంక్రమణ కనువిందు కవిత ప్రశంసాపత్రాన్ని సాధించింది. దక్షిణ దేశ తెలుగు భాషా ప్రతినిధుల కవుల కళాకారుల సంస్థ ఆధ్వర్యంలో, అధ్యక్షులు మడవలి చిరంజీవి భాగవతార్, గౌరవాధ్యక్షులు కర్ణాటకకు చెందిన కరణం నవీన్ రాజుల నేతృత్వంలో జరిగిన ఈ ప్రక్రియకు తిరుమలరావు స్పందించి కవితను పంపారు. ఈమేరకు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం, గొల్లచీమనపల్లి గ్రామం కేంద్రంగా అంతర్జాలం ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. ప్రకృతిని పరమాత్మగా పూజించే విధంగా సంక్రాంతి సంబరాలనుద్దేశించి కవితలను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక కేరళ రాష్ట్రాల పరిధిలో రచయితలు ఈ కవితలను పంపగా తిరుమలరావు కవిత ప్రశంసాపత్రానికి ఎంపికైంది. అధ్యక్షులు మడవలి చిరంజీవి భాగవతార్, గౌరవాధ్యక్షులు కరణం నవీన్ రాజులతో పాటు, సమన్వయకర్తలు తిరుపతి ఎ.ఎస్.ఫౌండేషన్ అధినేత అవిలాల శ్రీధర్, తమిళనాడు హోసూరు ఎ.వి.సీతారామయ్య, అగరం వసంతకుమార్, తిరుపతి తెలుగు కళా సమితి కర్ణాటక కె.జి.ఎఫ్. విశ్వం, బళ్ళారి పంపాపతి, బెంగుళూరు మాల్యాద్రి, రామ్మూర్తి నగర్ మంజునాథ్, కేరళ ఎర్నాకులం సుబ్బారెడ్డి, మైసూరు ప్రభాశాస్త్రి, పత్తికొండ భజంత్రీ శ్రీరాములు, పెద్ద వెలగటూరు గజ్జల అమ్ములు కళాభివందనాలు తెల్పుతూ తిరుమలరావుకు ప్రశంసాపత్రం పంపారు. తిరుమలరావుకు దక్షిణ దేశ స్థాయిలో ప్రశంసాపత్రం పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి