తిరుపతి జిల్లా రచయితల సంఘం [తిరసం] ఆధ్వర్యంలో 11/01/2026 సాయంత్రం అయిదు గంటలకు తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆర్సీ కృష్ణస్వామి రాజు రచించిన చింతల చేను నవలను ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి ఆచార్య కొలకలూరి మధుజ్యోతి ఆవిష్కరిస్తారు. పీలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ కె. శ్రీనివాసులు రెడ్డి సమీక్ష చేస్తారు. ఆత్మీయ అతిథులుగా తిరుపతి శంకరంబాడి సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ డి.మస్తానమ్మ, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ ఎన్.భీమన్న, పాల్గొంటారని తిరసం అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, కార్యదర్శి డాక్టర్ మన్నవ గంగాధర ప్రసాద్ తెలిపారు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి