కడుపుకోతకు కారణమెవరు?: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-విశాఖపట్నం
పాలు గారే పసిపిల్లయే
పరమేశ్వరుని ప్రతిరూపమే
కన్న తండ్రికి కంటివెలుగే
ఆడే పాడే అపరంజి బొమ్మయే
ఆమె మాటలే ముత్యాలని
ఆమె తమ ఇంటి మహాలక్ష్మని
అనురాగ ఆప్యాయతలను
రంగరించి
ఎంతో భవిష్యత్ ఊహించిన తండ్రి
తనమోటర్ బైక్ పై కూర్చుండబెట్టి
ఆనందంగా తీసుకు వెళుతున్న సమయాన
చైనా మాంజా మృత్యుపాశమై
రక్తస్రావంతో 
కన్నతల్లితండ్రుల
కడుపుకోతకు కారణమై 
అందని ఆనంతలోకాలకు చేరిన
చిన్నారి ఐదేండ్ల నిశ్విక మరణానికి బాధ్యులెవరు?
చట్టాలు మాటలకే పరిమితమా
పోయిన ప్రాణం తీసుకురాగలరా
ఇదేనా మానవత్వం
విజ్ఞులు, ప్రాజ్ఞులు ఆలోచించండి..!!

(నిన్న కూకట్ పల్లి భాగ్యనగరంలో తండ్రి తో కలసి బైక్ పై వెళుతున్న చిన్నారి నిశ్విక 'చైనా మాంజా' కారణంగా తీవ్ర రక్త స్రావమై మరణించిన సంఘటన విని ఆర్ధ్రతో వ్రాసినది)
.............................
.

కామెంట్‌లు